‘గుంటూరు కారం’లో కాజల్ గెస్ట్ రోల్ నిజమేనా.?
- September 23, 2023
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘గుంటూరు కారం’కి అనేక రకాల అదనపు గ్లామర్ అద్దబోతున్నారనీ తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో ఫుల్ డోస్ గ్లామర్ వుంది ఇద్దరు హీరోయిన్లతో.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఇద్దరే.. హాట్ అండ్ సో హాట్. ఇక, ఇప్పుడు మరో గ్లామర్ యాడ్ అవుతోందట.
చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓ స్టార్ హీరోయిన్‌తో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వాలనుకున్నారట. అది కాజల్ అయితే బాగుంటుందని మహేష్ బాబు సూచించాడట.
కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఈ పాత్ర వచ్చి పోతుందట. ఇది సినిమాకి ఓ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అనీ అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ‘గుంటూరు కారం’.
బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో చిత్ర యూనిట్ బిజీగా వుంది. సంక్రాంతికి సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







