ఈయూ-మిడ్ ఈస్ట్-ఇండియా కారిడార్ ప్రాజెక్ట్‌కు బహ్రెయిన్ మద్దతు
- September 24, 2023
బహ్రెయిన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్ మరియు ఇజ్రాయెల్‌తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా రైల్వే మరియు ఓడరేవు సౌకర్యాలను అనుసంధానించే ప్రతిపాదనకు బహ్రెయిన్ మద్దతును ప్రకటించింది. ఇది భారతదేశం, ఐరోపా మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేయగలదని, ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి కీలకంగా మారుతుందని పేర్కొంది. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ డెబ్బై ఎనిమిదవ సెషన్లో ప్రసంగించిన సమయంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. "ప్రజలందరి ప్రయోజనం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి, శ్రేయస్సుకు దోహదపడే ఈ ప్రతిష్టాత్మక వ్యూహాత్మక ప్రాజెక్ట్ కోసం మేము ఎదురుచూస్తున్నాము," అని డాక్టర్ అల్ జయానీ అన్నారు. న్యూఢిల్లీలో గ్రూప్ ఆఫ్ 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రారంభించబడిన భారతదేశం-మిడిల్ ఈస్ట్ -యూరోప్ ఆర్థిక కారిడార్‌ను ప్రపంచ దేశాలు స్వాగతించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







