రాబోతున్న వెంకటేష్,త్రివిక్రమ్ ల జోడి
- June 26, 2015
, by Maagulf
దృశ్యం సినిమా.. నాలుగు భాషల్లో రీమేక్ అవడంతో.. ఇప్పుడు అందరిచూపు మలయాళ చిత్రసీమపై పడింది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్.. కేరళలో విజయం సాదిస్తున్న చిత్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో.. ఇప్పటికే బెంగలూరు డేస్ సినిమా రీమేక్ రూపంలో చిత్రీకరణ ప్రారంభమవగా.. తాజాగా మరో మూడు సినిమాలపై కన్నేశారు మన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. రీసెంట్ గా మలయాళంలో ఒరు వడక్కన్ సెల్ఫీ (Oru Vadakkan Selfie), ప్రేమం అనే రెండు యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ సూపర్ సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం మన ఫిల్మ్ మేకర్స్ ఈ రెండింటి రీమేక్స్ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారట. ఇప్పటికే బాడీగార్డ్, దృశ్యం వంటి మలయాళ రీమేక్స్ లో నటించిన వెంకటేశ్.. తాజాగా మరో మలయాళ సినిమాపై మనసుపట్టాడట. మమ్ముట్టి, నయనతార జంటగా ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాధించిన చిత్రం భాస్కర్ ది రాస్కెల్. బాడీగార్డ్ ఫేం సిద్ధిఖీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను వెంకటేశ్ హీరోగా తెరకెక్కించేందుకు.. రీమేక్ రైట్స్ అందుకున్నారు సురేశ్ బాబు. అయితే ఈ రీమేక్ కు సంబంధించి.. దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు తెరపైకొచ్చింది. ఎన్టీఆర్ తో తాను చేయాల్సిన సినిమాకు మరికొన్ని నెలల సమయం ఉండడంతో... ఈ లోపు ఓ సినిమా పూర్తిచేయాలనే ప్లాన్ లో ఉన్నాడు త్రివిక్రమ్. సో... వెంకటేశ్ హీరోగా ఈ రీమేక్ సినిమాకు అంగీకరించే ఛాన్సెస్ లేకపోలేదు. పైగా.. గతంలో నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి వెంకటేశ్ చిత్రాలకు రచయితగా వర్క్ చేశాడు త్రివిక్రమ్. మరి... ఇన్నాళ్లుగా తన సొంత కథలతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్.