గ్యారేజ్ లో దాదా
- May 21, 2016
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. గతంలో బాలకృష్ణ నటించిన గాండీవం సినిమాలో ఒక పాటలో కనిపించిన ఈ స్టార్ హీరో, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తూ రెండు పోస్టర్స్ రిలీజ్ చేశారు.ఒక్కరోజు గ్యాప్ లో ఈ సినిమాలో నటిస్తున్న మోహన్ లాల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్స్ ను మళయాళంలో రిలీజ్ చేయటం విశేషం. శనివారం మళయాళ సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా జనతా గ్యారేజ్ మళయాల టైటిల్ తో పాటు మోహన్ లాల్ లుక్ ను రివీల్ చేశారు. రఫ్ లుక్ లో డాన్ లా కనిపిస్తున్న మోహన్ లాల్ వెంట రఘు, బ్రహ్మాజీ, బెనర్జీ, అజయ్ లు నడిచి వస్తున్న పోస్టర్ కు మాలీవుడ్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు మళయాలంలోనూ ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.
తాజా వార్తలు
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!







