ప్రవాసుల జనాభా తగ్గుదలతో పెరిగిన ఖాళీ అపార్ట్మెంట్లు
- October 02, 2023
కువైట్: ప్రవాసుల తొలగింపులో పెరుగుదల కారణంగా కువైట్లో ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ల సంఖ్య పెరిగింది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ఆస్తి అమ్మకాలు తగ్గాయి. కువైట్లో ఈ సంవత్సరం ప్రథమార్థం చివరి నాటికి జనావాసాలు లేని అద్దె పెట్టుబడి అపార్ట్మెంట్ల సంఖ్య దాదాపు 50,000కి చేరుకుంది. అధికారిక నివేదిక ప్రకారం.. నివాస ప్రాపర్టీ అమ్మకాలు KD 363 మిలియన్లకు చేరుకుంది. ఇది 2020 రెండవ త్రైమాసికం నుండి ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ప్రవాసులకు సందర్శన వీసాలు మంజూరు చేయడంపై పరిమితులు కూడా ఖాళీ అపార్ట్మెంట్ల పెరుగుదలకు దోహదపడ్డాయి. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రవాస జనాభా వృద్ధి రేటులో భారీ తగ్గుదల నమోదయింది. గత ఐదేళ్లలో వృద్ధి 5 శాతం నుంచి దాదాపు 1.8 శాతానికి పడిపోయింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







