అమెరికాలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం
- October 03, 2023
అమెరికా: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం అమెరికాలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. భారతదేశం వెలుపల అంబేద్కర్ యొక్క అతిపెద్ద విగ్రహం అమెరికాలోని మేరీల్యాండ్‌లో అక్టోబర్ 14న ఆవిష్కరించబడుతుంది. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ పేరుతో 19 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. మేరీల్యాండ్‌లోని అకోకీక్ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఏఐసీ)లో భాగంగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతికి చేసిన సేవలకు గుర్తుగా ఇప్పటికే భారత్‌లో చాలాచోట్ల ఎత్తైన విగ్రహాలున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే తెలంగాణ సర్కార్ ప్రపంచంలో ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు ఘన నివాళి అర్పించడమే కాకుండా.. ఆయన జీవితం గురించి.. రాబోయే తరాలు తెలుసుకునేలా చేసింది. అయితే అంబేడ్కర్ విగ్రహాలు భారత్‌లోనే కాకుండా ప్రపంచంలో పలు దేశాల్లో కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహం అమెరికాలో కూడా ఆవిష్కృతం కాబోతోంది. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 19 అడుగుల విగ్రహాన్ని అగ్రరాజ్యంలో రూపొందించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఈ విగ్రహంను ఏర్పాటు చేశామని ఏఐసీ తెలిపింది. అంతేకాదు సమానత్వం మరియు మానవ హక్కుల చిహ్నంగా కూడా ఇది ప్రదర్శిస్తుందని ఏఐసీ పేర్కొంది. ఇది భారతదేశం వెలుపల అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం అని, ఇది అక్టోబర్ 14న ఆవిష్కరించబడుతుందని చెప్పింది. అక్టోబర్ 14న మేరీల్యాండ్‌లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు హాజరవుతారు. గుజరాత్‌లోని సర్దార్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







