మీనాక్షి చౌదరికి ఏంటి ఇంత క్రేజ్.?

- October 03, 2023 , by Maagulf
మీనాక్షి చౌదరికి ఏంటి ఇంత క్రేజ్.?

ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ సరసన నటించే బంపర్ ఛాన్స్ కొట్టేసింది. విజయ్ ప్రస్తుతం ‘లియో’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి వుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసుకున్నట్లు తాజా సమాచారం.

ప్రస్తుతం మీనాక్షి చౌదరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తోంది. అలాగే, విశ్వక్ సేన్‌తో ఓ సినిమా, వరుణ్ తేజ్‌తో ‘మట్కా’ సినిమాలోనూ మీనాక్షి చౌదరి నటిస్తోంది.

తాజాగా కోలీవుడ్‌లో స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేయడంతో అమ్మడి హుషారు మరింత పెరిగినట్లైంది. ఆల్రెడీ తమిళంలో రెండు సినిమాలు చేసిన మీనాక్షి చౌదరికి భవిష్యత్తులో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు పట్టేయడానికి ఇది బంపర్ ఛాన్స్ అని చెప్పొచ్చేమో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com