సూపర్ స్టార్ సినిమాలో వెంకటేష్ హీరోయిన్.?
- October 03, 2023
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్ అంటే హీరోతో డ్యూయెట్లు పాడడం, రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించడం.. కానీ, ఈ సినిమాలో తమన్నాది అలాంటి పాత్ర కాదు. కేవలం ఓ స్పెషల్ రోల్ అని చెప్పొచ్చేమో.
ఓ స్సెషల్ సాంగ్ మరియు కొన్ని సన్నివేశాల్లో మాత్రమే తమన్నా కనిపిస్తుంది. అవి కూడా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి వున్న సన్నివేశాలు కావు. సాంగ్‌లో ఏదో అలా అలా రెండు స్టెప్పులు వేస్తుందంతే రజనీకాంత్‌తో కలిసి.
ఇక, తాజాగా ఇలాంటి సూపర్ ఛాన్సే మరో యంగ్ హీరోయిన్‌ని వరించింది. ఆమె ఎవరో కాదు, రితికా సింగ్. వెంకటేష్ హీరోగా వచ్చిన ‘గురు’ సినిమాలో బాక్సింగ్ లేడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్ తాజా చిత్రంలో నటిస్తోందట.
అయితే, రితికా సింగ్‌ది ఎలాంటి పాత్ర అనే వివరాలు తెలియాల్సి వుంది. ఏది ఏమైనా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో చాన్స్ అంటే అంత ఆషా మాషీ కాదుగా మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







