అల్లు రామాయణం ముందుకు కదులుతోందా.?

- October 04, 2023 , by Maagulf
అల్లు రామాయణం ముందుకు కదులుతోందా.?

అప్పుడెప్పుడో రామాయణ ఇతిహాసాన్ని తెరకెక్కించాలన్న తన మనసులోని మాటను బయటపెట్టారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారాయన. నిర్మాత మధుమంతెనతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాలనుకుంటున్నారు.

నితీష్ తివారి అందుకు స్ర్కిప్టు వర్క్ కూడా చేస్తున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతోందన్న వార్త హల్ చల్ చేస్తోంది.

అలాగే, ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ రావణాసుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ ఇతిహాసాన్ని మూడు భాగాలుగా నితీష్ తెరకెక్కించాలనుకున్నాడనీ తెలుస్తోంది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ఇతిహాసం రూపొందబోతోందట.

‘ఆది పురుష్’ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి తప్పులు దొర్లకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాలనుకుంటున్నారట. ఏ ఒక్క చిన్న విషయాన్నీ లైట్ తీసుకోకుండా దగ్గరుండి మరీ స్క్రిప్టు పనులు చూసుకుంటున్నారట అల్లు అరవింద్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పర్ఫెక్ట్ టీమ్ పని చేస్తోందనీ తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలతో ఓ క్లారిటీ ఇవ్వనున్నారట.  చూడాలి మరి, ఈ రామాయణం ఎలాంటి రెస్పాన్స్ అందుకోనుందో.!
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com