లియో ట్రైలర్ విడుదల...
- October 05, 2023
స్టార్ హీరో దళపతి విజయ్ కొత్త సినిమా ‘లియో’ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన కొద్దిసేపటికే ఈ ట్రైలర్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. రియల్ టైమ్ వ్యూస్ 5 మిలియన్లు దాటాయని సన్ టీవీ తెలిపింది.
విజయ్ యాక్షన్ సీన్స్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రూపొందిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ కథతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తో పాటు గౌతమ్ మీనన్, మిస్కిన్ నటిస్తున్నారు. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్ సినిమా తర్వాత విజయ్, లోకేశ్ కాంబోలో రూపుదిద్దుకున్న రెండో సినిమా ఇది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







