పుదీనా పకోడి
- June 26, 2015
కావలిసినవి
కాబూలీ చనా - కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా
కారం - అర చెంచా
ఉప్పు - తగినంత
శనగపిండి - అర కప్పు
జొన్నపిండి - అరకప్పు
కార్న్ ఫ్లోర్ - అర కప్పు
జీలకర్ర - అరచెంచా
వాము - అరచెంచా
పుదీనా - ఒక కట్ట
కొత్తిమీర - కొద్దిగా
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా కాబూలీ శనగలను కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, ఇంకా పైన చెప్పిన పదార్ధాలన్నింటినీ కలుపుకుని, పుదీనా, కొత్తిమీరలను సన్నగా తరిగినవి ఈ పిండి మిశ్రమంలో వేసి, బాగా పలుచగా కాకుండా కొంచెం ముద్దగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికించిన శనగలను ఈ పిండి మిశ్రమంలో ముంచుతూ కాగిన నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి తీయాలి. టొమాటో సాస్‌తో కలిపి సర్వ్ చేసుకుంటే ఘుమఘుమలాడే పుదీనా, చనా స్నాక్స్ రెడీ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







