మోహన్‌లాల్, గౌతమి జంటగా మరోసారి ..
- May 22, 2016
ఒకప్పటి ప్రముఖ బహుభాషా కథానాయకి గౌతమి. కొంత కాలం నటనకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల కమలహాసన్‌కు జంటగా పాపనాశం చిత్రంతో రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విజయం సాధించడంతో మళ్లీ గౌతమికి అవకాశాలు రావడం మొదలెట్టాయి. అయితే తనకు తగిన పాత్ర అయితేనే నటించాలని నిర్ణయించుకున్న తను తాజాగా ఒక త్రిభాషా చిత్రంలో నటించడం విశేషం. అదీ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు జంటగా నటిస్తుండడం మరో విశేషం.గౌతమి ఇంతకు ముందు మలయాళంలో మోహన్‌లాల్ సరసన హీజ్ ఐనస్ అబ్దుల్లా అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో మోహన్‌లాల్ గౌతమిలది హిట్ జంటగా పేరొందింది. తాజాగా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఒక చిత్రంలో మోహన్‌లాల్, గౌతమి జంటగా నటిస్తున్నారు. దీనికి తెలుగులో మనమంతా అనే పేరును, మలయాళంలో నమదు అనే టైటిల్‌ను నిర్ణయించారు.ఇందులో విశ్వనాథ్, హనీషా అమ్రేష్ యువ జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, ఊర్వశి, చంద్రమోహన్, గొల్లపూడి మారుతీరావు నటిస్తున్నారు. ఈ త్రిభాషా చిత్రాన్ని సాయిశివాని సమర్పణలో వారాహి చలనచిత్రం, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంతకు ముందు గోపీచంద్ తదితర ప్రముఖ కథానాయకులతో చిత్రాలను తెరకెక్కించిన ఏలేటి చంద్రశేఖర్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు వెల్లడించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







