ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది..
- May 22, 2016
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పునర్వినియోగానికి అనువైన ఆర్ఎల్వీ-టీడీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం 7గంటలకు షార్ నుంచి బయల్దేరిన రాకెట్ ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా నింగిలోకి 70 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి విజయవంతంగా భూమిని చేరింది. ఈ ప్రక్రియ మొత్తం 11 నిమిషాల్లోనే ముగిసింది.అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చ్యువల్ రన్‌వేపై రాకెట్ దిగింది. దీంతో షార్‌లో అప్పటి వరకూ ఉత్కంఠతో ఎదురు చూసిన శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకురావడానికి వీలు పడుతుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయి స్పేస్ షటిల్ రూపొందిస్తామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







