'కబాలి'ని మలేషియా బాష లోకి ...
- May 22, 2016
రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కబాలి'. రాధికా ఆప్టే కథానాయిక. ఇటీవల విడుదల చేసిన సినిమా టీజర్ ఆన్‌లైన్‌లో రికార్డులు సృష్టించింది. దీంతో 'కబాలి'పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రజనీకాంత్ ఫాలోయింగ్ ఆధారంగా ఈ చిత్రాన్ని ఇప్పటికే అనేక భాషల్లో డబ్ చేస్తున్నారు. ఈ జాబితాలోకి మరో భాష వచ్చి చేరింది.మలేషియాలో తమిళ చిత్రాలకు ఆదరణ బాగానే ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'కబాలి'ని మలయ్( మలేషియా బాష)లోకి అనువదిస్తున్నారు. దీంతో మలయ్ బాషలోకి డబ్ అయిన తొలి తమిళ చిత్రంగా కబాలి రికార్డు సృష్టించింది. మలేషియా మీడియా కంపెనీ అయిన మాలిక్ స్ట్రీమ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని మలేషియాలో విడుదల చేయనుంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దినేశ్ రవి, ధన్సిక, జాన్ విజయ్‌లు ముఖ్య పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









