ఇండియాలో మాజీ బహ్రెయినీ నివాసి హత్య

- May 22, 2016 , by Maagulf
ఇండియాలో మాజీ బహ్రెయినీ నివాసి హత్య

ఇండియాలోని బెంగళూరులో మాజీ బహ్రెయినీ నివాసితురాలు కిరణ్‌ సింగ్‌ హత్య పట్ల ఆమె మాజీ సహచరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గల్ఫ్‌ ఎయిర్‌లో క్యాబిన్‌ క్రూగా 1980లలో కిరణ్‌ సింగ్‌ పనిచేశారు. 1983 నుంచి 1988 వరకు కలిసి పనిచేశామని హమీద్‌ కరిమి, కిరణ్‌ సింగ్‌తో తన సాన్నిహిత్యం గురించి చెప్పారు. ఆమె ఎప్పుడూ సరదాగా ఉండేవారని వివరించారు హమీద్‌ కరిమి. భర్త నుంచి విడాకులు తీసుకున్న కిరణ్‌ సింగ్‌ ఢిల్లీ నుంచి బెంగళూరుకి మకాం మార్చారు. అక్కడే ఐదేళ్ళుగా ఆమె నివసిస్తున్నారు. కిచెన్‌లో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందడాన్ని ఆమె ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎలాంటి దొంగతనం జరిగిన ఆనవాళ్ళు లేకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. వాట్సాప్‌ మెసేజ్‌లు, ఆమె ఫోన్‌లో కాల్‌ డేటా వంటివాటిపై దృష్టిపెట్టిన పోలీసులు, హత్యకు గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com