గర్భిణులకు ఉపవాసం ప్రమాదకరమా?
- May 22, 2016
పవిత్ర రమదాన్ మాసంలో గర్భిణులు ఉపవాసం చేయడాన్ని ఇస్లాం సమర్థించనప్పటికీ, కొందరు మాత్రం రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని భావించి, ఉపవాసం కొనసాగిస్తారు. అయితే డాక్టర్లు గర్భిణీలకు ఉపవాసం చేయరాదనే సూచిస్తున్నారు. పూర్తి ఉపవాసం బిడ్డకు, తల్లికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరించారు. అయితే ఉపవాసం ద్వారా మంచే జరుగుతుందనే నమ్మకం సమాజంలో బలంగా వినవస్తున్నది. ఉపవాసం కొన్నిసార్లు మేలు చేసినా, గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెకు తగిన ఆహారం అవసరం అని ప్రముఖ గౌనకాలజిస్ట్ సలే అల్షాక్లి చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు తగినంత ఆహారంతోపాటు, నీరు కూడా సమృద్ధిగా తీసుకోవాలనీ, నీటిని సరిగ్గా తీసుకోనప్పుడు మూత్రం సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఒక్కోసారి డీహైడ్రేషన్‌కి గురై కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వివరించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి, ఉపవాసం చేయగలిగిన పక్షంలో తగినంత ఆహారం ముందుగానే తీసుకోవడం, అవసరమైతే ద్రవాహారం తీసుకోవడం వంటివి చేయడం ద్వారా పాక్షిక ఉపవాసం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ వహించకపోతే గర్భం దాల్చిన మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా, ఒక్కోసారి ప్రీమెచ్యూర్ బేబీస్‌కి జన్మనివ్వడం జరుగుతుందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







