ఎనిమిదో రోజు ‘వెన్నముద్దల బతుకమ్మ’
- October 21, 2023
తెలంగాణ పూల సంబురంలో ఏడు రోజులు ఏడు రకల బతుకమ్మలు ముగిసాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి. ఈరోజు ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ సంబురాలకు ఆడబిడ్డలు అన్ని సిద్ధం చేసుకున్నారు. రకరకాల పూలు తెచ్చి ఎనిమిది అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడిపాడతారు ఎనిమిదో రోజు..
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ సంబురాలు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఆడబిడ్డలు కూడా జరుపుకుంటారు. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలు ఆరోప్రాణంగా భావిస్తారు. బతుకమ్మను తమ ఇంటి బిడ్డగా ఆదరంగా..ఆత్మీయంగా భక్తిభావంతో కొలుచుకుంటారు. ఈ బతుకమ్మ సంబురాల్లో తొమ్మిది రోజుల పాటు ప్రతీ వీధి పూల పరిమళాలతో నిండిపోతుంది. ఆడబిడ్డల సందడితోను.. పూల సందడితో ప్రతీ ఇల్లు మురిసిపోతుంది.
మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగి సంబరాల్లో ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ పండుగలో తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆలయాల వద్దకు ఆడబిడ్డలంతా చేరి బతుకమ్మ ఆటలు ఆడతారు. పాటలతో బతుకమ్మ ఆడి చెరువులు, కుంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. వెన్నముద్దల బతుకమ్మ రోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. ఎనిమిదో రోజు ముగిస్తే ఇక తొమ్మిదో రోజు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మతో ఇక బతుకమ్మ సంబురాలు ముగియనున్నాయి.
వెన్నముద్దల బతుకమ్మ ప్రసాదంలో ఆరోగ్య రహస్యాలు..
వెన్నముద్దల బతుకమ్మ ప్రసాదంలో ఆరోగ్యం రహస్యాలు దాగి ఉన్నయి. నువ్వుల్లో కాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, మెగ్నీషియం ఉటాయి. నువ్వులు గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే బెల్లంలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లకు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియకు బెల్లం మేలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తింటే చక్కగా ఆరోగ్యం కలుగుతుంది. రెండు ఆహారాల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. భోజనం చేసిన తర్వాత ప్రతి రోజు బెల్లం, నువ్వులు కలిపి తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







