తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 23, 2023
దోహా: తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా మహా బతుకమ్మ సంబరాలు. ఆకట్టుకున్న చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1, నమూనాలు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు సుధ రామోజు తెలిపిన వివరాల ప్రకారం దోహా, ఖతర్ ఇండియన్ కల్చరల్ సెంటర్ లో భారీ జన సందోహం నడుమ తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ అడ్వైసరి కౌన్సిల్ చైర్ పర్సన్ నందిని అబ్బగౌని ఆధ్వర్యంలో భారీ జన సందోహం నడుమ తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిధులుగా ఖతర్ భారత రాయబార కార్యాలయం ప్రథమ కార్యదర్శి సచిన్ దినకర్ శంక్పాల్ హాజరు కాగా, ఐసీసీ అధ్యక్షుడు AP మణికంఠన్, ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షుడు EP అబ్దుల్ రెహ్మాన్, icbf ఉపాధ్యక్షులు దీపక్ శెట్టి ,ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం హెబ్బగెలు, ప్రధాన కార్యదర్శి మోహన్ కుమార్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ మలి రెడ్డి, సజీవ్ సత్యశీలన్, సుమ మహేశ్ గౌడ, సీనియర్ కమ్యూనిటీ లీడర్ శివరాం ప్రసాద్ కోడూరు, వివిధ సంఘాల ప్రెసిడెంట్లు అతిథులుగా హాజరయ్యారని తెలిపారు.ఈ సందర్భంగా జాగృతి ఖతర్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ లక్ష్మి గంట మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో వినూత్నంగా బతుకమ్మ నిర్వహిస్తూ వస్తున్న తెలంగాణ జాగృతి ఖతర్, ఈసారి నాలుగేళ్ల అవిశ్రాంత కృషి తో మానవ మేధస్సు కు మచ్చు తునక లాంటి చంద్రయాన్ ప్రయోగంతో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచం నివ్వెర పోయేల విజయ వంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి కి కృతజ్ఞతా పూర్వకంగా చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1, నమూనాల లతో ప్రదర్శించిన మహా బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది అని అన్నారు. సాంస్కృతిక కార్య క్రమాల్లో భాగంగా ఆడపడుచులు, చిన్నారులు చేసిన నృత్యాలు జనాన్ని ఉర్రూతలోగించాయి. అన్ని వర్గాల మద్దతుతో పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో విదేశి గడ్డ పై ఆడపడుచులు సాంప్రదాయ బతుకమ్మ ఆట పాటలతో లయ బద్ధంగా ఆడుతూ కనుల విందు చేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.


--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- Dubai Sports Council launches Annual Sports Events Calendar
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!







