వెనక్కి తగ్గిన ‘టిల్లు స్క్వేర్’.!
- October 27, 2023
‘డీజె టిల్లు’ సినిమాతో పిచ్చ పిచ్చగా క్రేజ్ కొట్టేసిన హీరో సిద్దు జొన్నలగడ్డ. చిన్న సినిమాల్లో పెద్ద విజయం నమోదు చేసింది ఈ సినిమా. తనదైన ఆటిట్యూడ్‌తో సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుని సెన్సేషనల్ అయిపోయాడీ కుర్ర హీరో.
అదే క్రేజ్‌తో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నాడు. అదే ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాదికి విడుదల లేనట్లే అని తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారట. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రోమోలు యూత్‌ని యాజ్ యూజ్వల్ ఉర్రూతలూగిస్తోంది. అలాగే, మొదటి పార్ట్‌లో నటించిన నేహా శెట్టిని రెండో పార్ట్‌లో ఓ సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా చూపించబోతున్నారట.
ఒక్క భామతోనే ఉల్టా ఫల్టా అయ్యాడు మొదటి పార్ట్‌లో.. ఇక ఇప్పుడు రెండో పార్ట్‌లో ఇద్దరు అందగత్తెలు. ఈ ఇద్దరు అందగత్తెల మధ్య రెండో టిల్లుగాడు ఎలా నలిగి నలిగి బయట పడతాడో.? తెలియాలంటే ఫిబ్రవరి వరకూ ఆగాల్సిందే.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







