ఈజిప్ట్ రోడ్డు ప్రమాదం..35 మంది మృతి

- October 28, 2023 , by Maagulf
ఈజిప్ట్ రోడ్డు ప్రమాదం..35 మంది మృతి

కైరో: ఈజిప్టులోని కైరో-అలెగ్జాండ్రియా మోటర్‌వేలో బస్సు మరియు అనేక కార్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కనీసం 35 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. "వాడీ అల్-నట్రూన్ సమీపంలోని కైరో-అలెగ్జాండ్రియా ఎడారి రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 35 మంది మృతి చెందారు. వీరిలో కనీసం 18 మంది కాలిపోయి మరణించారు. కనీసం 53 మంది గాయపడ్డారు" అని స్థానిక అధికారులు తెలిపారు. కారు నుండి ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ విషాద ప్రమాదం సంభవించి ఉండవచ్చని, ఇది ఇతర వాహనాలకు మంటలు వ్యాపించిందని, పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com