ప్రెగ్నెంట్ లేడీస్‌కి జింక్ ప్రాధాన్యత.!
- October 28, 2023
కణజాలాల అభివృద్ధిలో అతి ముఖ్యమైన పాత్ర వహించే ఖనిజం జింక్. అందుకే ఖచ్చితంగా ఆహారంలో వుండాల్సిన ఖనిజం జింక్. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం తదితర ఖనిజాలన్నింట్లోనూ జింక్ పాత్ర అత్యంత కీలకం అని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయాలంటే శరీరంలో తగిన మోతాదులో జింక్ కంటెంట్ వుండాల్సిందే. సహజ సిద్ధంగా రోజులో 8 మిల్లీ గ్రాముల మోతాదులో జింక్ అవసరమవుతుంది.
అదే గర్భిణీ స్ర్తీలలో అయితే 11 నుంచి 12 మిల్లీ గ్రాముల వరకూ జింక్ మోతాదు తప్పని సరి అంటున్నారు. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఫుడ్ ద్వారా అందే జింక్ కంటెంట్‌తో పాటూ, ట్యాబ్లెట్ల రూపంలో జింక్ కంటెంట్ అందిస్తుంటారు.
కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి, కణజాలాలు సక్రమంగా వృద్ధి చెందడానికి జింక్ చాలా ముఖ్యం. అంతేకాదు, గాయాలు నయం చేయడంలో జింక్ ప్రధాన పాత్ర వహిస్తుంది.
జింక్ సరైన మోతాదులో అందాలంటే, ముఖ్యంగా గర్భిణీ స్ర్తీలు వైద్యులు సూచించిన మందులతో పాటూ, రెడ్ మీట్, చిరు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాల్సి వుంటుంది.
అలాగే, నువ్వులలో జింక్ కంటెంట్ చాలా ఎక్కువ. గర్భిణీ స్ర్రీలు నువ్వుల్ని ఆహారంలో వివిధ రకాలుగా కానీ, లేదా బెల్లంతో కలిపిన నువ్వుల వుండల్ని కానీ ప్రతీరోజూ తీసుకోవల్సి వుంటుంది.
నువ్వుల నూనెను ఆహారంలో రెగ్యులర్‌గా వాడడం మంచిది. బాదం పప్పులోనూ జింక్ శాతం ఎక్కువ. ప్రతీ రోజూ నానబెట్టి, పొట్టు తీసిన బాదం పప్పుల్ని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. డైట్‌లో తేలికగా దొరికే ఈ ఐటెమ్స్‌ని చేర్చుకోవడం ద్వారా గర్భిణీ స్ర్రీలకు ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, సుఖ ప్రసవం అవుతుంది. తల్లీ బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా వుంటారని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







