ఖతార్ షాపులు, దుఖాణాల ఆకస్మిక తనిఖీలు
- June 26, 2015
ఖతార్ మునిసిపాలిటీ మరియు అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ వారి సహకారంతో ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు దేశమంతటా ఉన్న దుఖాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారు దోహా, మొయితెర్ మరియు అల్ రయ్యాన్ లలో తప్పుడు లేబుల్స్ అతికించిన, ఆమోడిత ధరల పట్టికను అతిక్రమించిన 8 దుఖాణాలను గుర్తించారు. సల్వా రోడ్డులోని గురు-శుక్రవారాల మార్కెట్లో మొబైల్ ఫోన్లు, కాస్మెటిక్స్ వంటి షాపులలో 18 అతిక్రమణలకు, సరైన క్వాలిటీ టైర్లను అమ్మనందుకు 10 దుఖానాలకు; అల్ ఘరాఫ్ మరియు సల్వా కమర్షియల్ స్ట్రీట్ లోని 6 మొబైల్ షాపుల వారికి అతిక్రమణ నోటీసులిచ్చారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలోని వాణిజ్య కేంద్రాలలో వినియోగదారుల సంక్షేమం మరియు గారంటీని పెంపొందించడానికి ఈ విధమైన తనిఖీ పర్యటనలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







