షురా కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో పెరిగిన మహిళల భాగస్వామ్యం
- October 29, 2023
మస్కట్: రాజకీయ జీవితంలో ఒమానీ మహిళల చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి మజ్లిస్ అల్ షురా పదవ సారి సభ్యుల ఎన్నికలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం జరగనున్న మజ్లిస్ అల్ షురా పదో దఫా ఎన్నికలలో 738 మంది అభ్యర్థులు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. వీరిలో 31 మంది మహిళలు ఉండటం గమనార్హం. నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 753,690కి చేరుకోగా.. వారిలో 362,844 మంది మహిళలు ఉన్నారు. ఈ ఓటర్లలో 91 శాతం మంది “ఇంతాఖిబ్” అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోగా, మిగిలిన 9 శాతం మంది ఎన్నికల వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకున్నారు. నేషనల్ రికార్డ్స్ అండ్ ఆర్కైవ్స్ అథారిటీ చైర్మన్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ సలహాదారు షేఖా తమీమా బింట్ మొహమ్మద్ అల్ మహ్రూఖీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రాథమిక చట్టం వివిధ మార్గాల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే మహిళల హక్కులకు హామీ ఇస్తుందన్నారు. విద్య, ఉద్యోగ తదితర రంగాలలో ఒమానీ మహిళల కీలక పాత్రను ఆమె హైలైట్ చేసారు. 1970ల నుండి ఒమన్ సాధించిన అద్భుతమైన పురోగతిని గుర్తించి, మహిళలకు ఓటు వేసే మరియు ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలిచే హక్కును కల్పించిన మొదటి GCC రాష్ట్రం ఒమన్ అని గుర్తుచేసుకున్నారు. అయితే, నిర్ణయం తీసుకునే స్థానాల్లో మహిళలు అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఇంకా కృషి చేయాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







