పాలస్తీనియన్లకు మద్దతుగా కదిలిన దుబాయ్ నివాసితులు
- October 30, 2023
దుబాయ్: రెండవ తరహూమ్ ఫర్ గాజా ప్రచారంలో భాగంగా ఆదివారం దుబాయ్‌లోని ఫెస్టివల్ అరేనాలో ఆరు నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్సు గల వందలాది మంది వాలంటీర్లు వేలాది వినియోగ వస్తువులను ప్యాక్ చేయడానికి క్యూలో నిలబడ్డారు. యూఏఈ ఎయిడ్, దుబాయ్ కేర్స్ మరియు ఎమిరేట్స్ రెడ్‌క్రాస్ ప్రారంభించిన ప్రచారంలో అన్ని వర్గాల, జాతీయతలకు చెందిన ప్రజలు చేతులు కలిపారు. యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనియన్ల కోసం ప్రాథమిక ఆహారం, బిస్కెట్లు, చక్కెర, టూత్‌పేస్ట్, షాంపూ, పరిశుభ్రత కిట్లు, దుప్పట్లు మరియు ఇతర వినియోగ వస్తువులను ప్యాక్ చేయడానికి ముందుకువచ్చారు. పాలస్తీనియన్ల కోసం వేలాది ఎమర్జెన్సీ రిలీఫ్ కిట్లను ప్యాక్ చేయడానికి. అబుదాబిలోని ఎతిహాద్ అరేనా, షార్జాలోని అల్ బైత్ ముతావహిద్లో కూడా ఇలాంటి ప్రచారాలను ఆదివారం నిర్వహించారు. దుబాయ్ కేర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్దుల్లా అహ్మద్ అల్షెహి మాట్లాడుతూ.. వేలాది మంది వాలంటీర్లు ప్రచారం కోసం నమోదు చేసుకున్నారని చెప్పారు. మొదటి ఎడిషన్‌లో, మేము సుమారు 7,500 బాక్సులను ప్యాక్ చేసామని, ఈసారి వేల బాక్సులను కూడా ఆశిస్తున్నట్లు అల్షెహి చెప్పారు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









