గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు బహ్రెయిన్ డిమాండ్
- October 30, 2023
బహ్రెయిన్: గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ పాటించాలని బహ్రెయిన్ విదేశాంగ మంత్రి, H.E. డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ కోరారు. బందీలు మరియు ఖైదీల విడుదల చేయాలని సూచించారు. పాలస్తీనియన్లకు మానవతా సహాయాన్ని అందించడం కోసం బహ్రెయిన్ రాజ్యం ముందుంటుందని పునరుద్ఘాటించారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ జనరల్, పాలస్తీనా ప్రభుత్వానికి చెందిన పలువురు సీనియర్ అధికారుల సమక్షంలో పాలస్తీనా రాష్ట్ర అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ను ఆదివారం రమల్లాలో కలిసిన సందర్భంగా డాక్టర్ అల్ జయానీ మాట్లాడారు. పౌరుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అమాయకుల ప్రాణాలు కోల్పోయే ఏ చర్యనైనా ఖండించాలని, పిల్లల హత్యలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాలని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. గాజాలో మానవతావాద సంధికి పిలుపునిచ్చే తీర్మానాన్ని120 ఓట్లతో ఆమోదించినందుకు డాక్టర్ అల్ జయానీ ఆ UN జనరల్ అసెంబ్లీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







