సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- September 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలపై గత ఆగస్టు నెలలో మొత్తం 108 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు పర్యవేక్షణ, అవినీతి నిరోధక సంస్థ నజాహా (Nazaha) వెల్లడించింది. అరెస్టయిన వారిలో కొందరిని అనంతరం బెయిల్‌పై విడుదల చేసినట్లు తెలిపింది. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను పెంపొందించడం, అవినీతిని అరికట్టడం లక్ష్యంగా ఆగస్టు నెలలో నజాహా పలు క్రిమినల్, పరిపాలనా కేసులను ప్రారంభించింది.
ఈ నెలలో నజాహా అధికారులు మొత్తం 2,659 తనిఖీలు నిర్వహించారు. అవినీతి కేసుల్లో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 352 మంది ఉద్యోగులపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, మున్సిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖలకు చెందిన 108 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన ఉద్యోగులపై లంచం తీసుకోవడం, అధికారిక పదవులను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు నమోదు చేసినట్లు నజాహా పేర్కొంది. ప్రభుత్వ రంగంలో అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని నజాహా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







