దుబాయ్ లో పాస్‌పోర్ట్‌లపై ప్రత్యేక స్టాంప్

- November 03, 2023 , by Maagulf
దుబాయ్ లో పాస్‌పోర్ట్‌లపై ప్రత్యేక స్టాంప్

దుబాయ్: నవంబర్ 6 నుండి 18 వరకు దుబాయ్ విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులు వారి పాస్‌పోర్ట్‌లపై ప్రత్యేక స్టాంప్ పొందుతారని గురువారం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ స్మారక స్టాంప్‌ను విడుదల చేసింది. ఇది దుబాయ్ ఎయిర్‌షో కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపింది.  దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB) లేదా దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (DWC) ద్వారా ప్రయాణించినా, ప్రయాణీకులందికి ఈ ప్రత్యేక స్టాంపింగ్ చేయనున్నారు. దుబాయ్ ఎయిర్‌షో 18వ ఎడిషన్ విమానయాన, అంతరిక్ష రంగంలోని తాజా ఆవిష్కరణలు,ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తుంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో నవంబర్ 13 నుండి 17 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్ కు 95 దేశాల నుండి 1,400 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.  180కి పైగా అత్యాధునిక వాణిజ్య, ప్రైవేట్, సైనిక విమానాలు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com