పాన్ కార్డు పోయిందా? పది నిమిషాల్లో కొత్త కార్డు వచ్చేస్తుంది..
- November 14, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో కొన్ని పత్రాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిల్లో మొదటిది ఆధార్ కార్డు అయితే, రెండోవది పాన్ కార్డు. ఆధార్ కార్డు అనేది ఒక భారతీయ పౌరునిగా ఒక గుర్తింపు లాంటిది కాగా.. పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు ఆర్థిక లావాదేవీలకు సంబంధించింది. ఈ కార్డు ఉంటేనే బ్యాంకింగ్ సేవలు పొందగలం. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా లేదా ఆస్తి కొనుగోలు చేయాలన్నా ఇది ఉండాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో పాన్ కార్డు కనిపించకుండా పోవచ్చు. లేదా పర్సు పోయిన సందర్భంలో కార్డు మిస్ అవ్వొచ్చు. అలాంటి సమయంలో కొత్త కార్డు కావాలంటే ఎలా? లేదా ఆన్ లైన్ అప్పటికప్పుడు ఈ-పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..
పది నిమిషాల్లో ఈ-కార్డు..
సాధారణంగా కార్డు పోయిన సందర్భంలో మరో కార్డు అప్లై చేయాలంటే అధీకృత కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ-పాన్ కార్డు కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కేవలం పది నిమిషాల్లో కార్డును పొందొచ్చు. అదెలా అంటే.. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సాధ్యం అవుతుంది. ఆ పోర్టల్లో ఈ-పాన్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ సేవ ద్వారా మీ ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఆధార్ పాన్‌తో లింక్ అయ్యి ఉండాలి. రెండింటికీ అనుసంధానమైనా మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. ఈ-పాన్‌ను రూపొందించడం వల్ల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఆఫ్‌లైన్ ప్రాసెస్‌ల అవసరాన్ని కూడా తొలగిస్తుంది.
ఈ-పాన్ సేవ అంటే ఏమిటి?
చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్ ఉన్న వినియోగదారులకు తక్షణ పాన్ కార్డ్‌లను అందించడానికి ఈ-పాన్ సేవను రూపొందించారు. ఆధార్‌తో లింక్ అయిన ఈ-కేవైసీ ధ్రువీకరణ ద్వారా వినియోగదారు వివరాలను ధ్రువీకరించిన తర్వాత ఈ డిజిటల్ సంతకం చేసిన కార్డ్‌లు దాదాపు జారీ అవుతాయి. వినియోగదారులు ఈ-పాన్ ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉచితంగా అందుకుంటారు.
ఈ-పాన్ ఎలా పొందాలంటే..
- ఆదాయపు పన్ను శాఖ యొక్క ఈ-ఫైలింగ్ పోర్టల్(https://www.incometax.gov.in/iec/foportal/)ని సందర్శించండి.
- ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీ లో “ఇన్ స్టంట్ ఈ-పాన్” పై క్లిక్ చేయండి.
- ఈ-పాన్ పేజీలో, “గెట్ న్యూ ఈ-పాన్” క్లిక్ చేయండి.
- అప్లికేషన్ పేజీలో మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
- చెక్‌బాక్స్‌ని తనిఖీ చేసి, “కంటిన్యూ”పై క్లిక్ చేయండి.
- ఓటీపీ ధ్రువీకరణ పేజీలో, కింద చెక్ బాక్స్ లో క్లిక్ చేసి, ఆపై “కంటిన్యూ” క్లిక్ చేయండి.
- మీ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌లో అందుకున్న 6-అంకెల ఓటీపీని నమోదు చేయండి.
- చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, “కంటిన్యూ” పై క్లిక్ చేయడం ద్వారా యూఐడీఏఐతో ఆధార్ వివరాలను ధ్రువీకరించండి.
- చెల్లుబాటు అయ్యే ఆధార్ వివరాల పేజీలో, “ఐ ఎగ్రీ బటన్ పై క్లిక్ చేసి, చెక్‌బాక్స్‌ని ఎంచుకుని, “కంటిన్యూ” క్లిక్ చేయండి.
- సమర్పణ తర్వాత, రసీదు సంఖ్యను ప్రదర్శిస్తూ విజయవంతమైన సందేశ స్క్రీన్ కనిపిస్తుంది.
- అప్పుడు మీరు ఈ-పాన్ వీక్షించడానికి, డౌన్‌లోడ్ చేయడానికి ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. డౌన్‌లోడ్ ఎంపికను ఎంచుకొని దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!







