కువైట్ మ్యాచ్ కు తాము సిద్ధం: భారత ఫుట్‌బాల్ కోచ్
- November 16, 2023
కువైట్: ఫిఫా వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్స్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత జాతీయ జట్టు ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్ అన్నారు. భారత్, కువైట్‌లు రెండూ చాలా మంచి జట్లేనని, గురువారం అద్భుతమైన ఆటను ఆశించవచ్చని పేర్కొన్నారు. జబర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మీడియాతో ఆయన మాట్లాడారు. "మేము బాగా సన్నద్ధమయ్యాముజ మేము గత కొన్ని రోజులుగా దుబాయ్‌లో ఉన్నాము. కువైట్ తో జరుగనున్న మ్యాచ్‌లో బాగా ఆడటానికి మేము ప్రయత్నిస్తాం" అని కోచ్ స్టిమాక్ చెప్పారు. భారత జాతీయ జట్టు FIFA ప్రపంచ కప్ 2026 మరియు AFC ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 జాయింట్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో కువైట్ జాతీయ జట్టుతో నవంబర్ 16వ తేదీన జబర్ అల్-అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కువైట్‌లో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







