జెడ్డా సౌత్ ఓబుర్ వాటర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభం

- November 16, 2023 , by Maagulf
జెడ్డా సౌత్ ఓబుర్ వాటర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభం

జెడ్డా: జెడ్డా సౌత్ ఓబుర్ వాటర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ మరియు బహ్జా ప్రాజెక్ట్‌ను మక్కా రీజియన్ డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్ ప్రారంభించారు. మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి మజేద్ అల్-హోగైల్, జెడ్డా గవర్నరేట్ ఇంజినీర్ మేయర్ సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.  సౌదీ విజన్ 2030 లక్ష్యాలను సాధించడానికి పురపాలక సేవల అభివృద్ధి కార్యక్రమాలు, జీవన నాణ్యతను మెరుగుపరిచే రెండు ప్రాజెక్టుల గురించి ప్రిన్స్ బదర్ బిన్ సుల్తాన్‌కు వివరించారు. 205000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సౌత్ ఓబుర్ వాటర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో సీ ప్రొమెనేడ్, సైకిల్ పాత్ మరియు ఓపెన్ గ్రీన్ ప్రాంతాలతో పాటు కార్ పార్కింగ్, పిల్లల వినోద ప్రదేశాలు, ఇసుక బీచ్‌లు ఉన్నాయి.  పౌరులు, నివాసితుల ఆకాంక్షలకు సరిపోయే ఉత్తమ డిజైన్ ప్రమాణాలకు అనుగుణంగా.. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే పార్కులు,  బహిరంగ ప్రదేశాలను సృష్టించడం ద్వారా రాజ్యంలో అన్ని నగరాల్లో నివాసితులకు ఆదర్శవంతమైన పట్టణ వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా ప్రాజెక్టులను రూపొందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com