చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది మృతి
- November 16, 2023
బీజింగ్: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలో ఐదంతస్తుల భవనంలో ఓ ప్రైవేటు బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం మంటలు చెలరేగాయి. రెండవ అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది మరణించారు. 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు అధికారులు. చైనా భారీ అగ్ని ప్రమాదాలకు కేంద్రంగా మారింది. హై రేంజ్ అపార్టుమెంట్ లో తరచుగా అగ్నిప్రమాదాలుగా జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో అన్యాంగ్ నగరంలోని ఓ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించి 38 మంది దుర్మరణం పాలయ్యారు. అంతకు ముందు ఏడాది అక్టోబర్ నెలలో షెన్ యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ముగ్గురు మరణించగా.. 30 మంది గాయపడ్డారు. 2015లో టింజిన్ లోని రసాయన గోదాముల్లో జరిగిన వరుస పేలుళ్లలో 175 మంది చనిపోయారు. చైనాలోని బొగ్గు గనుల్లో అగ్ని ప్రమాదాలు తరుచు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







