కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
- November 16, 2023
తెలంగాణ: సీఎం కేసీఆర్ సభలో ఓ వ్యక్తి బుల్లెట్లతో తిరగడం కలకలం రేపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వద సభ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు మూడు నియోజకవర్గాలు కవర్ చేస్తూ భారీ సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ , కాంగ్రెస్ బిజెపి పార్టీల ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. నేడు మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
గురువారం సాయంత్రం కేసీఆర్ నర్సాపూర్ సభలో ప్రసంగిస్తుండగా..అస్లాం అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడం తో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని చెక్ చేయగా అతడి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అస్లాంను విచారిస్తున్నారు. బుల్లెట్లు ఎక్కడివి..? ఎందుకు తీసుకొచ్చాడు..? వాటితో ఏంచేయాలి అనుకున్నాడు..? వంటి ప్రశ్నలు అడుగుతూ దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!