రమదాన్ డిస్కౌంట్‌ సేల్స్‌పై అప్రమత్తం

- May 25, 2016 , by Maagulf
రమదాన్  డిస్కౌంట్‌ సేల్స్‌పై అప్రమత్తం

రమదాన్  సందర్భంగా మార్కెట్‌లో డిస్కౌంట్‌ ప్రకటనల హోరు కనిపిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్‌ ముసుగులో క్వాలిటీలేని గూడ్స్‌ అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రధానంగా వస్త్రాల విషయంలో నాణ్యత లేని సరుకు, సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతుంది. ముందస్తుగా పెద్దయెత్తున డంప్‌ చేయడం, అవి కొంత మేర నాణ్యత కోల్పోవడం జరుగుతుందనీ, వాటిని మార్కెట్‌లో కొత్తగా అమ్మకాలకు పెట్టడంతో, రమదాన్ మాసంలో కొనుగోళ్ళు జరిపేవారికి తేడా తెలియక నష్టపోతుంటారని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా, జజాన్‌ మునిసిపాలిటీ రమదాన్  సందర్భంగా మార్కెట్‌లో డిస్కౌంట్‌ ప్రకటనల హోరు కనిపిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్‌ ముసుగులో క్వాలిటీలేని గూడ్స్‌ అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రధానంగా వస్త్రాల విషయంలో నాణ్యత లేని సరుకు, సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతుంది. ముందస్తుగా పెద్దయెత్తున డంప్‌ చేయడం, అవి కొంత మేర నాణ్యత కోల్పోవడం జరుగుతుందనీ, వాటిని మార్కెట్‌లో కొత్తగా అమ్మకాలకు పెట్టడంతో, రమదాన్ మాసంలో కొనుగోళ్ళు జరిపేవారికి తేడా తెలియక నష్టపోతుంటారని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా, జజాన్‌ మునిసిపాలిటీ రమదాన్ షాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రధానంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించనున్నారు అధికారులు. అలాగే రెస్టారెంట్లపైనా ప్రత్యేక నిఘా కొనసాగిస్తారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. గడువు తీరిన ఆహార పదార్థాల అమ్మకాలపై కఠినంగా వ్యవహరించనున్నారు అధికారులు. దీనికి సంబందించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలనీ, పబ్లిక్‌ సేఫ్టీ, వినియోగదారుల భద్రత పట్ల అవగాహనతో వ్యవహరించాలని డిప్యూటీ మేయర్‌ ఫర్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ ఇబ్రహీమ్‌ అల్‌ ఖయాత్‌ చెప్పారు. షాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రధానంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించనున్నారు అధికారులు. అలాగే రెస్టారెంట్లపైనా ప్రత్యేక నిఘా కొనసాగిస్తారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. గడువు తీరిన ఆహార పదార్థాల అమ్మకాలపై కఠినంగా వ్యవహరించనున్నారు అధికారులు. దీనికి సంబందించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలనీ, పబ్లిక్‌ సేఫ్టీ, వినియోగదారుల భద్రత పట్ల అవగాహనతో వ్యవహరించాలని డిప్యూటీ మేయర్‌ ఫర్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ ఇబ్రహీమ్‌ అల్‌ ఖయాత్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com