పేషెంట్లకు డిజిటల్ రికార్డులు
- May 25, 2016
హమాద్ మెడికల్ కార్పొరేషన్ ఆసుపత్రులు మరియు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పూర్తిగా డిజిటల్ చేయనున్నాయి. జులై నాటికి ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా, పేపర్‌లెస్ పేషెంట్ రికార్డ్స్ సాధ్యమవుతాయనీ, వీటి ద్వారా ఓ పేషెంట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం డాక్టర్‌కి క్షణాల్లో తెలుస్తుందని అధికారులు వివరించారు. క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధుల సమయంలో ఈ సిఐఎస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మెడికల్ అండ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ ఎఫైర్స్ ఫర్ సిఐఎస్ ఎట్ హెచ్‌ఎంఎస్ డిప్యూటీ చీఫ్ డాక్టర్ అబ్దుల్ వాహమబ్ అల్ ముస్లె చెప్పారు. ఓ వ్యక్తికి వైద్యం చేస్తున్న సమయంలో, ఆ రోగికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక్క బటన్ ద్వారా అందుబాటులోకి వస్తే, ఆ డాక్టర్ ఆ రోగికి మరింత సమర్థవంతంగా చికిత్స అందించగలరని ఆయన చెప్పారు. తమ సంస్థలో ఈ సిఐఎస్‌కి సంబంధించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నామని డాక్టర్ అల్ ముస్లె చెప్పారు. పూర్తిస్థాయిలో సిఐఎస్ అందుబాటులోకి వస్తే ఖతార్, ప్రపంచంలోనే రెండో దేశంగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ విభాగంలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







