విశాఖ ఘటన పై సీఎం జగన్ దిగ్భ్రాంతి..

- November 20, 2023 , by Maagulf
విశాఖ ఘటన పై సీఎం జగన్ దిగ్భ్రాంతి..

అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఈ ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఒక్కో బోటులో 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 బోట్లు కాలి బూడిద కాగా.. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి. రూ.30కోట్లకు పైగా ఆస్తినష్టం కాగా.. 3వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇంకా భారీగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ లో మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. చివరి బోటు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. బోట్లలో డీజిల్ నిండి ఉండడంతో దట్టంగా పొగ వ్యాపించింది. మంటలు చెలరేగి 40కి పైగా మరబోట్లు దగ్ధమయ్యాయని.. పోలీసులు తెలిపారు. రాత్రి 10:30 గంటలకు మంటలు చెలరేగాయని.. గాలుల తీవ్రతతో పక్క బోట్లకు వ్యాపించాయని తెలిపారు. బోట్లలో సిలిండర్లు, డీజిల్‌ ఉండడంతో మంటల తీవ్రత పెరిగిందని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డీసీపీ ఆనందరెడ్డి తెలిపారు. కొన్ని బోట్లు దగ్ధమయ్యాయి, మరికొన్ని తరలించాం, ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని డీసీపీ ఆనందరెడ్డి వివరించారు. ఈ ప్రమాదం పై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని విశాఖ సీపీ రవిశంకర్‌ తెలిపారు. ప్రమాదం తర్వాత యువకులు పరారయ్యారని.. వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com