ఇండియా వస్తున్న కార్గో షిప్ హైజాక్
- November 20, 2023
భారతదేశానికి వెళుతున్న కార్గో షిప్ ను హౌతీ మిలిటెంట్లు హెలికాప్టర్ సాయంతో హైజాక్ చేశారు. యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలీషియా దక్షిణ ఎర్ర సముద్రంలో భారత్‌కు చెందిన అంతర్జాతీయ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. భారత్ కార్గో షిప్ హైజాక్ చేయడం ఇరానియన్ ఉగ్రవాద చర్య అని ఇజ్రాయెల్ పేర్కొంది. హైజాక్ అయిన ఓడలో ఓడలో ఇజ్రాయెల్ పౌరులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.
దక్షిణ ఎర్ర సముద్రం నుండి నౌకను యెమెన్ నౌకాశ్రయానికి తీసుకువెళ్లినట్లు బృందం తెలిపింది. హౌతీలు హెలికాప్టర్‌ను ఉపయోగించి ఓడపై ఫైటర్లను దించడం ద్వారా హైజాక్ చేశారు. ఈ కార్గో షిప్ బ్రిటీష్ కంపెనీకి చెందినదని, దీనిని జపాన్ కంపెనీ నిర్వహిస్తోందని టెల్ అవీవ్ తెలిపింది. నౌకలో ఉక్రేనియన్, బల్గేరియన్, ఫిలిప్పీన్స్, మెక్సికన్ సహా వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ నౌకలో భారతీయులు ఎవరూ లేరని ఇజ్రాయెల్ తెలిపింది. తుర్కియే నుంచి భారత్ వస్తున్న ఈ నౌకను మిలిటెంట్లు హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. ఇలాంటి ఘటనలు అంతర్జాతీయ అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తాయని ఇజ్రాయెల్ పేర్కొంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







