ఎయిర్ టాక్సీలు: తగ్గనున్న 40% ట్రావెల్ టైమ్
- November 20, 2023
యూఏఈ: 2026 మొదటి త్రైమాసికం నాటికి యూఏఈ ఆకాశంలో పూర్తి-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు కనిపించనున్నాయి. యూఏఈ అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీ (AAM) కార్యక్రమాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభ కానున్నాయి. ప్రజలు త్వరలో ట్రాఫిక్ సమస్యల బైబై చెబుతూ.. ఎయిర్ టాక్సీలలో వెళ్లవచ్చు. దీంతో ఎమిరేట్స్‌లో ప్రయాణ సమయం నగరాల్లో 40 శాతం ఆదా అవుతుందని యూఏఈ ప్రభుత్వ ఇన్నోవేటివ్ మొబిలిటీ నిపుణుడు, చీఫ్ స్పెషలిస్ట్ రూబా అబ్దేలాల్ అన్నారు. ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా లేదా కూడళ్లతో ఆగాల్సిన అవసరం లేకుండా మరియు ట్రాఫిక్ లైట్లు, రౌండ్‌అబౌట్‌లపై వేచి ఉండకుండా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్‌కి సులభంగా.. వేగంగా చేరుకోవచ్చని తెలిపారు. దీంతోపాటు ఎయిర్ టాక్సీల రాకతో మిలియన్ల కొద్దీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని, రాబోయే పదేళ్లలో ఈ ప్రాంతంలో వేలాది ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..