వావ్.! వాట్ ఏ టాలెంట్ నానీ.!
- November 20, 2023
నేచురల్ స్టార్ నాని మహా టాలెంటెడ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన సహజమైన నటనతో పక్కింటబ్బాయ్లా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయాడు.
అయితే నానీలో ఈ తరహా టాలెంట్ కూడా వుందా.? అని ఆశ్చర్యపోయేలా చేశాడిప్పుడు. ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా నాని కామెంటేటర్ అవతారమెత్తాడు.
ప్రొఫిషనల్ కామెంటేటర్లతో కలిసి కాసేపు సందడి చేశాడు. మొదట స్లోగా తన కామెంటరీ స్టార్ట్ చేసిన నాని, ఆ తర్వాత ప్రొఫిషనల్ కామెంటేటర్‌గా తనలోని టాలెంట్ బయటికి తీసేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఇంత టాలెంట్ నానిలోనా.! వావ్.! అని ఆశ్చర్యపోయారు. అయితే, గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం నానికి వుంది. అలాగే, వీజెగానూ నాని అనుభవజ్ఞుడు.
అందుకే ఈ టాలెంట్ సాధ్యపడిందనుకోవాలేమో. అన్నట్లు ఇదే సీజన్లో వెంకటేష్ కూడా తనదైన కామెంటరీతో క్రికెట్ ప్రియుల్ని అలరించాడు.
కొసమెరుపేంటంటే, విక్టరీ వెంకటేష్ ఇండియా టీమ్‌ని గెలపిస్తే.. నాని ఏమో ఓడించాడు.! జస్ట్ జోకింగ్.. సోషల్ మీడియాలో ఇలాగే మీమ్స్ పడుతున్నాయ్ మరి.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







