చాట్‌జీపీటీలో కొత్త వాయిస్ ఫీచర్..

- November 22, 2023 , by Maagulf
చాట్‌జీపీటీలో కొత్త వాయిస్ ఫీచర్..

ప్రముఖ ఓపెన్ఏఐ సంస్థ రూపొందించిన టెక్నాలజీ టూల్ చాట్‌జీపీటీలో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. చాట్‌జీపీటీ యూజర్ల అందరి కోసం వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ గురించి ఓపెన్ఏఐ ఇటీవలే ఒక ప్రకటనలో వెల్లడించింది. చాట్‌జీపీటీని వాడే యూజర్లు ఎవరైనా సరే కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా వాయిస్ ఫీచర్ ద్వారా మాట్లాడేందుకు అనుమతినిస్తుంది. తద్వారా వాయిస్ ఇన్‌పుట్స్ అందించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు, ఈ వాయిస్ ఫీచర్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఉచితంగా లేదా పేమెంట్ చేయడం ద్వారా వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

టెక్స్ట్ బదులుగా వాయిస్ కమాండ్స్:
ఈ చాట్‌జీపీటీ వాయిస్ ఫీచర్‌ని ఉపయోగించడానికి వినియోగదారులు తమ ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం హెడ్‌ఫోన్‌ ఐకాన్ కోసం సెర్చ్ చేయాలి. ఈ ఐకాన్‌పై ట్యాప్ చేయడం ద్వారా వాయిస్ చాటింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయడానికి బదులుగా వినియోగదారులు చాట్‌జీపీటీతో మాట్లాడేందుకు వీలు కల్పిస్తుంది. ఈ అప్‌డేట్ చాట్‌జీపీటీ అనుభవాన్ని గణనీయంగా మారుస్తుందని మాజీ ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్‌మన్ పేర్కొన్నారు. ఏఐ టూల్‌తో యూజర్లు సులభంగా ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆకర్షణీయంగా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఐదు విభిన్న వాయిస్‌లను ఎంచుకోవచ్చు:
చాట్‌జీపీటీ వాయిస్ ఫీచర్ వినియోగదారులు వారి ప్రాధాన్యతల ఆధారంగా ఎంచుకోవడానికి ఐదు విభిన్న వాయిస్‌లను అందిస్తుంది. ఈ వాయిస్‌లను రూపొందించడానికి ఓపెన్ఏఐ ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్స్‌తో కలిసి పనిచేసింది. అదనంగా, మాట్లాడే పదాలను చాట్‌జీపీటీ అర్థం చేసుకోగలిగే టెక్స్ట్‌గా మార్చడానికి కంపెనీ ప్రత్యేక విస్పర్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com