మదీనాలో సౌదీయా విమానం అత్యవసర ల్యాండింగ్

- November 23, 2023 , by Maagulf
మదీనాలో సౌదీయా విమానం అత్యవసర ల్యాండింగ్

మదీనా: సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ విమానం మంగళవారం మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యెమెన్ ప్రయాణీకురాలికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలను కాపాడటానికి అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. రియాద్‌కు వెళ్లే విమానం (SV1038) జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. విమానంలో ఉన్న సౌదీ వైద్య బృందం ప్రాథమిక జోక్యం తర్వాత ఫ్లైట్ కెప్టెన్ అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించాడు.  జెడ్డా నుండి విమానం బయలుదేరిన అరగంట తర్వాత యెమెన్ మహిళ మూర్ఛపోయిందని ప్రయాణికులు చెప్పారు. ఆమె పరిస్థితి గురించి విమాన సిబ్బందికి సమాచారం అందించగా.. విమానంలో ఉన్న సౌదీ వైద్య బృందం పరిశీలించారు. ఆమె పరిస్థితి మెరుగైంది. కానీ ఏడు నిమిషాలు మరోసారి యువతి పరిస్థితి క్షీణించింది. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య బృందం ఆలస్యం చేయకుండా ఆమెను ఆస్పత్రికి తరలించాలని విమాన సిబ్బందికి సూచించారు. ఆమె పరిస్థితి గురించి పైలట్‌కు సమాచారం అందించగా.. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించడానికి మదీనా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే, ఎయిర్‌పోర్ట్‌లోని వైద్య బృందం ఆమెను ఆస్పత్రికి తరలించారు. మదీనా హెల్త్ క్లస్టర్ ప్రతినిధి అబ్దుల్‌రహ్మాన్ హమౌదా మాట్లాడుతూ.. దేశీయ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు యెమెన్‌కు చెందిన 20 ఏళ్ల మహిళ నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com