‘యానిమల్’.! రష్మిక అతి చేసిందా.?

- November 25, 2023 , by Maagulf
‘యానిమల్’.! రష్మిక అతి చేసిందా.?

బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ డిశంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది ఈ సినిమాపై.
అది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం గురించి కావచ్చు, లేదంటే, హీరోయిన్ రష్మిక మండన్నా గురించి కావచ్చు. సినిమా ప్రోమోలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేలా వున్నాయ్.
ఇక ట్రైలర్ చూశాకా తెలుగు జనం అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయ్. ఓ బాలీవుడ్ సినిమాని ఇంత చక్కగా తెలుగు నేటివిటీకి కనెక్ట్ చేశారే.! అని ఆశ్చర్యపోయేంతలా.!
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ఇన్‌ప్లూయెన్స్ ఈ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్‌పై చాలా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. గెటప్, ఆటిట్యూడ్ అంతా అర్జున్ రెడ్డి‌లో విజయ్ దేవరకొండనే తలపిస్తోంది.
అయితే, సెంటిమెంట్ పరంగా తండ్రి పాత్రలో కనిపించిన అనిల్ కపూర్ ఈ సినిమాకి ప్రాణం పెట్టేశారు. హీరో రణ్‌బీర్ కపూర్ నటనను సైతం ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు. ఇక ప్రోమోస్‌లో రష్మిక విషయానికి వస్తే.. కాస్త ఓవరాక్షన్‌లా అనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. జస్ట్ ట్రైలర్ చూసి ఆ రకంగా అభప్రాయ పడడం కరెక్ట్ కాదేమో.. అంటూ కొందరు రష్మికను సపోర్ట్ చేస్తున్నారు.
అలాగే రష్మిక ఆ పాత్రను ఒప్పుకుందంటే.. ఆ పాత్రకు ఖచ్చితంగా ఇంపార్టెన్స్, డెప్త్ వుండకుండా వుండవ్. ఎందుకు తొందర.! మరికొద్ది రోజుల్లోనే అసలు విషయం తేలిపోనుంది. లెట్స్ వెయిట్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com