విజయ్ దేవరకొండ - రష్మిక అసలేంటీ ముచ్చట.!
- November 28, 2023
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసేసుకున్నారా సీక్రెట్‌గా.? అవుననే అంటున్నాయ్ టాలీవుడ్‌లో కొన్ని వర్గాలు. ఎందుకలా.? అంత సీక్రెసీ ఎందుకట.? అంటే ఏమో ఎవరి రీజన్స్ వారికుంటాయ్.
అయితే, విజయ్ దేవరకొండ, రష్మిక మధ్యన ఏదో జరుగుతోందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే వుంది. వీరి మధ్య రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనే వున్నాయ్.
కానీ, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. మా మధ్య అలాంటిదేమీ లేదంటూ వీరిద్దరూ ఖండిస్తూ వస్తున్నారు. లేటెస్ట్‌గా దీవాళీ సెలబ్రేషన్స్ సైతం రష్మిక, విజయ్ దేవరకొండ ఇంట్లో కలిసి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
అది కూడా తాజాగా వీరిద్దరికీ పెళ్లియపోయిందని వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తోంది. సెలబ్రిటీలన్నాకా ఈ తరహా పుకార్లు సహజమే.
అలాగని లైట్ తీసుకోవడానికి కూడా లేదు. ఇలాగే గాలి వార్తలు అని కొట్టి పడేసిన వరుణ్, లావణ్య విషయంలో ఏం జరిగింది.? పుకార్లు పుకార్లు అన్నారు.. కట్ చేస్తే అదే నిజం చేశారు. చక్కగా పెళ్లి చేసుకుని ఒకింటి వాళ్లయిపోయారు.
అలాగే, విజయ్ దేవరకొండ, రష్మిక విషయంలో ఎందుకు జరక్కూడదు.? అనేది కొందరి వాదన. ఏది ఏమైనా.. ఈ ఇద్దరూ కన్‌ఫామ్ చేస్తే కానీ అధికారికంగా ఒప్పుకోలేం కదా.! తప్పదు అంతవరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ పుకార్లను ఎంజాయ్ చేయాల్సిందే.!
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







