నిద్రలేమి గల కారణాలు ..
- May 26, 2016
ఆహారపుటలవాట్లూ.. జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిని నిద్రలేమి బాధిస్తుంది. అలాంటి వారు ఈ పానీయాలను తాగడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గి.. హాయిగా నిద్రపడుతుంది.కొబ్బరి నీళ్లు: పొటాషియం, మెగ్నీషియం నీళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కండరాలను ఉత్తేజితం చేస్తాయి. అలానే కొబ్బరి నీళ్లలోని విటమిన్ బి ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకోవడానికి ఓ రెండు గంటల ముందు నీళ్లను తాగడం మంచిది.
గ్రీన్ టీ: అమినో ఆమ్లాలు సమృద్ధిగా లభించే గ్రీన్ టీ హాయి నిద్రకు కారణమవుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తగ్గించి.. ఒత్తిడినీ దూరం చేస్తాయి. త్వరగా నిద్రపట్టేందుకు గ్రీన్టీలోని పోషకాలు దోహదం చేస్తాయి.లెమన్ టీ: గ్లాసు వేణ్నీళ్లలో నిమ్మరసం, అల్లం ముక్కలు, తేనె వేసి బాగా మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా అయ్యాక వడకట్టి తాగితే చక్కగా నిద్రపడుతుంది.సబ్జా గింజలు: వేసవి తాపాన్ని తీర్చే సబ్జాగింజలు.. ఒత్తిడిని దూరంగా చేసి నిద్రపట్టడానికి దోహదం చేస్తాయి. ఈ గింజల్ని ఉడికించి రాత్రంతా ఫ్రిజ్లో పెట్టాలి. మరుసటి రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు నీళ్లలో కలుపుకుని తాగితే మంచిది.పాలు: గోరువెచ్చని పాలలో తేనె, బాదం పొడి, వేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి. తేనె బాదం వల్ల శరీరానికి అమినో ఆమ్లాలు అందుతాయి. అవి ఒత్తిడినీ, చిరాకులను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







