వాట్సాప్‌లో లాక్ చాట్స్ కోసం సీక్రెట్ కోడ్ ఫీచర్..
- December 01, 2023
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లాక్ చేసిన చాట్‌ల కోసం కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ చాట్ లాక్ ఫీచర్‌ను ప్రకటించింది. అయితే, ఇప్పుడు మీ లాక్ చేసిన చాట్‌లను సీక్రెడ్ కోడ్‌తో హైడ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఫలితంగా, మీ ఫోన్‌ను స్నేహితుడికి ఇచ్చినప్పుడు లేదా మీ ఫోన్ ఎవరి చేతుల్లోకి అయిన వెళ్లినప్పుడు ఇతర వినియోగదారులతో మీ వ్యక్తిగత చాటింగ్ మెసేజ్‌లను వారికి కనిపించకుండా దాచుకోవచ్చు.
సీక్రెట్ కోడ్‌తో చాట్ ఎలా హైడ్ చేయొచ్చుంటే?
మీ ఫోన్ పిన్ లేదా పాస్‌కోడ్‌తో లేదా మీ ఫేస్ లేదా వేలిముద్రను స్కాన్ చేయడం ద్వారా మీ చాట్‌లను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చాట్ లాక్ ఫీచర్‌లో కొత్త సీక్రెట్ కోడ్ తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. యూజర్లు తమ చాట్‌ని ఎంచుకుని, పాస్‌వర్డ్ ద్వారా లాక్ చేయడానికి అనుమతిస్తుంది. సీక్రెడ్ కోడ్ ద్వారా హైడ్ చేసిన చాట్‌లు ప్రధాన చాట్ జాబితాలో కనిపించవు. సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేసినప్పుడు మాత్రమే యాక్సెస్ అవుతాయి. మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌కు సెక్యూరిటీని మరింత అందించేందుకు ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో యాప్ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ని టెస్టింగ్ చేసింది. మీరు లాక్ చేసిన చాట్ లిస్టును ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎగువన ఉన్న మూడు-చుక్కల మెనుని ట్యాప్ చేయండి> చాట్ లాక్ సెట్టింగ్‌లు > Hide locked chats అనే ఆప్షన్‌పై టోగుల్ చేయాలి. మీరు సులభంగా గుర్తుంచుకోగలిగే రహస్య కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత మీ లాక్ చేసిన చాట్‌లు ఇకపై ప్రధాన చాట్‌లో కనిపించవు. విండో లో ప్రస్తుతం, వాట్సాప్ చాట్ స్క్రీన్‌పై కిందికి స్వైప్ చేస్తున్నప్పుడు లాక్ చేసిన చాట్‌ల షార్ట్‌కట్ కనిపిస్తుంది. మీ ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







