హర్షవర్థన్ దర్శకత్వం వైపు అడుగు..
- May 26, 2016
తెలుగు సినిమా ఇండస్ట్రిలో హాస్యనటులు దర్శకులుగా మారడం చూస్తూనే ఉన్నాం. ఏవీఎస్, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ.. దర్శకులుగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. వెన్నెల కిషోర్ కూడా మెగాఫోన్‌పట్టిన వాడే. ఇప్పుడు కొత్తగా మరో హాస్యనటుడు కెప్టెన్ కుర్చీలో కూర్చుంటున్నాడు. తనే హర్షవర్థన్. అమృతం సీరియల్‌తో పాపులర్ అయిన హర్షవర్థన్.. కొన్ని సినిమాల్లో రాణించాడు. రచయతగానూ నిరూపించుకొన్నాడు. ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. రామాయణం పేరుతో ఓ కథ సిద్ధం చేసుకొన్న హర్షవర్థన్.. ఓ నిర్మాతని పట్టేశాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని టాక్. రామాయణం అనే పేరున్నా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ కాదని, ఈతరం ప్రేమకథే అని తెలుస్తోంది. హ్యూమర్, ఎమోషనల్ టచ్‌తో సాగే ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేసుకొంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అయితే. ప్రకాష్‌రాజ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మన ఊరి రామాయాణం అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల టైటిళ్లు క్లాష్ అయ్యే ప్రమాదం ఉంది
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు







