జంతు సందేశం

- May 26, 2016 , by Maagulf

 

ఓ మనిషి నాలోని మనోభావాల్ని చెప్పడానికి 

నాకు నోరు లేదు 
దేవుడిచ్చిన గడ్డే నాకు ఆహారం 
నా శరీరవసరం సహ జీవాలతో కామిస్తుంది
ఇంటి చూరు నీడన చోటిచ్చినందుకు 
జీవితమంతా నీకు ధారపోస్తున్నాను
పంచభక్ష్య పరమన్నాల్ని పండిస్తూ నా రక్త మాంసాల్ని 
కూడా అందిస్తున్నాను 
కాని నీవు నాలా కాదే 
ఆలోచించే శక్తి ఉండి ఆధునికపు అర్థనగ్నాల్ని 
ప్రోత్చహిస్తున్నావు 
ఆదేశించే అధికారం ఉండి అడ్డమయిన గడ్డికి అర్రులు 
చాస్తున్నావు 
కనిపెంచిన పెద్దలకు విశ్వాసఘాతకం
చేస్తున్నావు 
వావి వరుసలున్న నీవే దిక్కులేని అబలలపై 
అత్యాచారాలు చేస్తున్నావు 
పొలాన్ని చదును చేసి చేసి ఎముకలు తేలి 
చేతకాని చేవలేని నన్ను తిను, కాని 
నాకన్నా నీ జన్మ శ్రేష్టమని చెప్పిన నీతి 
సూత్రాల్ని మరువకు 
మరిస్తే నీకన్న నీచమైన జన్మ మరోటి 
ఉండదేమో ... !

 

--జయ రెడ్డి బోడ,అబుధాబి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com