శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని..
- May 26, 2016
'భలే భలే మగాడివోయ్' వంటి భారీ హిట్ తర్వాత 'కృష్ణ గాడి వీరప్రేమగాథ' వినిపించిన నాని ప్రస్తుతం తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'జెంటిల్‌మన్'గా తెరమీదకొచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటించేందుకు కమిట్ అయ్యాడట. సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'భలే మంచి రోజు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీరామ్.. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మెప్పించాడు. శ్రీరామ్ చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో ఈ సినిమాను నాని అంగీకరించినట్లు తెలుస్తోంది. భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సున్నితమైన కుటుంబ అనుబంధాలు విలువలను బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుందట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







