'శభాష్ నాయుడు' లోకమల్హాసన్..
- May 26, 2016
రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, లైకా సంస్థ సంయుక్తంగా 'విశ్వ కథానాయకుడు' కమల్‌హాసన్ నటిస్తున్న చిత్రం 'శభాష్ నాయుడు'. టీకే రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు సహాయ దర్శకురాలిగా కమల్ రెండో కుమార్తె అక్షర వ్యవహరిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. 1989లో రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో కమల్ నటించారు. ఇప్పుడు దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చుతున్నారు. మే 16న లాస్ ఏంజెల్స్‌లో చిత్రీకరణ ఆరంభం కానుందని కమల్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్రయూనిట్, కమల్‌హాసన్ అమెరికా చేరుకున్నారు. దీనిగురించి కమల్ స్పందిస్తూ.. కొన్ని సమస్యలను ఎదుర్కొని ప్రస్తుతం అమెరికా చేరుకున్నాం. ఇందుకు చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ఎంతో సహకరించింది. మూడు భాషల స్క్రిప్టుతో ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ చేరుకున్నామని సంతోషాన్ని పంచుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







