ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధo..
- May 26, 2016
నిహారిక కొణిదెల నాగ శౌర్య జంటగా, TV 9 సమర్పణలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇటివలే మెగా హీరోల చేతుల మీదుగా విడుదలైన పాటలకు శ్రోతలనుండి విశేష స్పందన లభిస్తోందని, సినిమా ఫస్ట్ లుక్ మొదలుకుని ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ వరకూ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అనూహ్యమైన స్పందన తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఇప్పటి రొటీన్ చిత్రాలకి విభిన్నంగా ఒక హృద్యమైన ప్రేమకధతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో నిహారిక, నాగ శౌర్యల నటన ఆకట్టుకుంటుందనీ, ప్రేమ, కుటుంబం, బాధ్యతలు వాటి విలువలు లాంటి అంశాలతో ముడిపడివున్న ఈ ఒక మనసు సినిమా ప్రతి మనసుని అలరిస్తుందని, సునీల్ కశ్యప్ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని జూన్ 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామరాజు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







