‘ఖుషి’ మ్యూజిక్ డైరెక్టర్ మరో హిట్ కొడతాడా.?
- December 06, 2023
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ ‘ఖుషి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమయ్యాడు. ‘ఖుషీ..’ అంటూ అందర్నీ ఆప్యాయంగా పలకరించేలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆ సినిమాకి.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమాకి పాటల నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, సినిమా రిలీజ్ అయ్యాకా స్టఫ్ సరిపోలేదంటూ యావరేజ్ ఖాతాలో పడేశారనుకోండి. పాటలయితే సూపర్ హిట్టు అందులో నో డౌట్.
ఇప్పుడు ఈ హేషమ్ ‘హాయ్ నాన్న’ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా పాటలు కూడా బాగానే వినిపిస్తున్నాయ్. సినిమాకి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయ్యింది ఇప్పటికే. ఇక, మరికొద్ది గంటల్లోనే సినిమా రిలీజ్ కావల్సి వుంది.
ఈ నేపథ్యంలో హేషమ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఆయన మ్యూజిక్ అందించిన ‘హాయ్ నాన్న’ సినిమా హిట్ అయితే, ఇక చూసుకోనక్కర్లేదు తెలుగులో మరిన్ని అవకాశాలు ఆయన సొంతం అంతే.!
ఇక, ‘హాయ్ నాన్న’ విషయానికి వస్తే, నాని, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందుతోన్న ఈ సినిమా తండ్రి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతోంది. పాజిటివ్ బజ్ అందుకుంటోంది. నానికి మరో ‘దసరా’ పండగ తెస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- Dubai Sports Council launches Annual Sports Events Calendar
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!







